ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికారుల నిర్లక్ష్యంతోనే నా భర్త మృతి' - ap jenko engineer died news in telugu

ఏపీ జెన్కో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనుమానాస్పద మృతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మృతుడి బంధువులు సిద్దమవుతున్నారు. తన భర్తను హోమ్ క్వారంటైన్‌లో ఉండమని చెప్పిన అధికారులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి శ్రద్ధ చూపించకుండా వదిలేశారని మృతుడి భార్య ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జెన్‌కో ఇంజినీర్ ఏఈ‌ అనుమానాస్పద మృతి
జెన్‌కో ఇంజినీర్ ఏఈ‌ అనుమానాస్పద మృతి

By

Published : May 29, 2020, 4:34 PM IST

ఏపీ జెన్కో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనుమానాస్పద మృతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి బంధువులు సన్నద్ధమవుతున్నారు. ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్​లో సహాయ ఇంజినీర్‌గా శ్రీనివాస్ పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిక్కుకుపోయి ఆయన ఈనెల 21న సీలేరు వచ్చి విధుల్లో చేరారు. అయితే అధికారుల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయమై ఇంట్లో వాళ్లకి మూడు రోజులుగా ఎటువంటి సమాచారం లేకపోవటంతో వారి సూచన మేరకు తోటి ఉద్యోగులు ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లారు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టగా శ్రీనివాస్ తన పడక గదిలో విగతజీవిగా పడిఉన్నారు. అనంతరం మృతదేహానికి పంచనామ చేసి పోస్టుమార్టం నిర్వహించారు.

స్థానిక అధికారుల సమాచారంతో శ్రీనివాస్ బంధుమిత్రులు సీలేరుకు చేరుకున్నారు. అధికారుల తీరుపై మృతుడి బంధుమిత్రులు మండిపడ్డారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న తనభర్త ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి శ్రద్ధ చూపించకుండా వదిలేశారని మృతుడి భార్య ఆరోపించారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. శ్రీనివాస్ భౌతికకాయానికి సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్ మోహన్ రావు, విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్ నివాళులర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నీలకంఠం తెలిపారు. మృతుని భార్య ఏపీ ఈపీడీసీఎల్ లో సహాయ ఇంజినీరుగా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చూడండి:శానిటైజర్‌ తాగి ఏఎస్​ఐ ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details