ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ చికిత్స కోసం.. ముందురోజు రాత్రి నుంచే రోగుల నిరీక్షణ..! - AP News

Patients suffering in KG hospital: విశాఖలోని కేజీహెచ్‌లో వైద్య సేవల కోసం జీర్ణాశయ సంబంధ వ్యాధిగ్రస్తులు బారులు తీరుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు... ఓపీ వైద్య సేవల కోసం ముందు రోజు రాత్రి నుంచే క్యూ కడుతున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జీర్ణాశయ సమస్యలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఒక్క కేజీహెచ్‌లో మాత్రమే అందుబాటులో ఉండటంతో రద్దీ పెరుగుతోంది. అదనంగా సేవలు పెంచాలని రోగులు కోరుతున్నారు.

Patients suffering in KG hospital
Patients suffering in KG hospital

By

Published : Mar 18, 2022, 8:21 PM IST

Patients suffering in KG hospital: విశాఖ కేజీహెచ్‌లో జీర్ణాశయ సంబంధ వ్యాధుల ఓపీ వైద్య సేవల కోసం రోగులు బారులు తీరుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ముందురోజు రాత్రే చేరుకొని వరుస కడుతున్నారు. బుధ, శనివారాలు మాత్రమే సేవలు అందడంతో రెండు, మూడుసార్లు తిరిగినా వైద్యం అందని పరిస్థితి ఎదురవుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జీర్ణాశయ సమస్యలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఒక్క కేజీహెచ్‌లో మాత్రమే అందుబాటులో ఉండటంతో రద్దీ పెరుగుతోంది. అదనంగా సేవలు పెంచాలని రోగులు కోరుతున్నారు.

ముందురోజు రాత్రి నుంచే కేజీహెచ్‌ ఎదుట నిరీక్షిస్తున్న రోగులు

10 వేల మంది వరకు చెకప్‌...

విశాఖ కేజీహెచ్‌లో కిడ్నీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో సమస్యలకు వారంలో రెండు రోజుల చొప్పున సూపర్‌స్పెషాలిటీ ఓపీ చూస్తారు. ప్రస్తుతం కేజీహెచ్‌కు వచ్చే కేసుల్లో ఎక్కువగా గ్యాస్ట్రోవే ఉంటున్నాయి. ఓపీ రాయించుకొని వచ్చే కొత్త కేసులతో పాటు వార్డుల్లో ఉన్న వారు, గతంలో పరీక్షలు రాసి నివేదికలతో వచ్చేవారు ఒకే వరుసలో ఉండాల్సివస్తోంది. ఇందువల్ల రోగులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం వైద్య నివేదికలతో వచ్చిన వారిని వేరుగా చూడాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. బుధ, శనివారాల్లో వచ్చే రోగులు 400 వరకు ఉంటుంటే... ఏడాదికి 10 వేల మంది వరకు చెకప్‌ కోసం వస్తున్నారు.

దూరప్రాంత రోగుల అవస్థలు..
ఉదయం 7 గంటల నుంచే క్యూలో ఉంటున్నా మధ్యాహ్నం 12 గంటలైనా వైద్యుడి వద్దకు వెళ్లే అవకాశం దొరకడం లేదు. మధ్యాహ్నం వరకే వైద్యులు చూస్తారని బోర్డులో రాసి ఉంటుంది. కొందరు వైద్యులు ఉదయం 11 గంటలకు వస్తున్నారు. ఎక్కువ మంది రోగులు ఉంటున్నందున ఉదయం 8 గంటల నుంచి చూస్తే కొంతైనా ఊరట కలుగుతుంది. ఒకటి రెండుసార్లు వచ్చిన వారు.. ఆ అనుభవంతో ముందురోజు రాత్రే వచ్చి ఉదయాన్నే క్యూలో నిలుచుంటున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. జీర్ణాశయ సంబంధ వ్యాధుల ఓపీ వైద్య సేవలు పెంచాలని రోగులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:వీవోఏ నాగ‌ల‌క్ష్మిది ఆత్మహ‌త్య కాదు.. వైకాపా నేత చేసిన హ‌త్య: లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details