విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ పరిసర గ్రామాల్లో పరిస్థితి సర్దుకుందని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. మంత్రులు, అధికారుల పిలుపుతో గ్రామాలకు తిరిగొచ్చిన కొందరు ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఎన్ని సార్లు శుభ్రం చేసినా విష వాయువు వాసనలు పోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. అక్కడే ఉండలేక తిరిగి వెనక్కివెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గని విషవాయువు ప్రభావం - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనతో భయందోళనకు గురైన ప్రజలు ఇళ్లనే వదిలివెళ్లిపోయారు. పరిస్థితి తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలపటంతో కొంతమంది తిరిగి ఇంటికి వెళ్లిన విషవాయువు ప్రభావం ఎక్కువగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ఇబ్బందులను మా ప్రతినిధి ఆదిత్యపవన్ వివరిస్తారు.
విషవాయువు ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు