ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈఎస్​ఐ, పీఎఫ్​ సౌకర్యం కల్పించాలి: గ్యాస్​ డెలివరీ బాయ్స్​

By

Published : May 10, 2021, 7:34 PM IST

ప్రజల్లో కరోనా భయం వెంటాడుతోంది. పలు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కొవిడ్​ కారణంగా పని చేసేందుకు వెనకాడుతున్నారు. గ్యాస్​ సిలిండర్లు డెలివరీ ఇచ్చే క్రమంలో వైరస్​ సోకుతుందేమోనని.. విశాఖలోని గ్యాస్​ బాయ్స్​ ఆందోళన వ్యక్తం చేశారు.

gas delivery boys
ఆందోళన చేస్తున్న గ్యాస్​ డెలివరీ బాయ్స్​

విశాఖలో హిందూస్తాన్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలకు చెందిన సిలెండర్ల డెలివరీ.. 2 రోజులుగా నిలిచిపోయింది. ఇప్పటికే నలుగురు డెలివరీ బాయ్స్ కరోనా బారిన పడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కొవిడ్‌ భయంతో పని చేసేందుకు.. మిగిలిన డెలివరీ బాయ్స్ భయపడుతున్నారు. ఇళ్లకు నేరుగా వెళ్లి గ్యాస్ ఇవ్వడం, తిరిగి సిలెండర్ తీసుకోవడం వల్ల కరోనా సోకుతోందని ఆవేదన చెందుతున్నారు. తమకు జీతాలు పెంచాలని.. ఈఎస్​ఐ, పీఎఫ్​ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details