విశాఖలో లాక్ డౌన్ పటిష్టంగా జరుగుతోంది. ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రధానంగా అత్యవసర సేవలు మాత్రమే అందుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో సైతం ప్రజలకు అవసరమైన వంట గ్యాస్ అందించడంలో డెలివరీ బాయ్‌లు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. కరోనా భయం ఉన్నా... అన్ని రక్షణ చర్యలు తీసుకుని సిలిండర్లు అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లోని ఇళ్లకు తిరుగుతూ.. సుమారు 2 వేల మంది విధుల్లో భాగమవుతున్నారు. వారి సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రజల సేవలో 'గ్యాస్ డెలివరీ బాయ్స్' - lockdown in visakha
లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరకులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు నిరంతరాయంగా గ్యాస్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. రెడ్ జోన్ ప్రాంతమైనా.. మామూలూ వీధి అయినా గ్యాస్ బాయ్స్ సేవలు కొనసాగిస్తున్నారు. విశాఖ పట్టణంలోఉదయం ఆరు గంటల నుంచి వివిధ ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి గ్యాస్ అందించి ప్రజలకు సేవలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
విశాఖలో గ్యాస్ డెలివరీ బాయ్స్