VISAKHA GARJANA : పరిపాలనా రాజధాని కావాలని ఐకాస నిర్వహించిన విశాఖ గర్జన అధికార వైకాపా పూర్తి అండదండలతో సాగింది. ఈ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాంతోపాటు మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా విశాఖలోని L.I.C జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లి పార్క్ హోటల్ జంక్షన్ కు చేరుకున్నారు. అక్కడ వై.ఎస్. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద సభ నిర్వహించారు. వైకాపా ర్యాలీకి వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది.
ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించామని మంత్రులు తెలిపారు. మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని.. దీన్ని కప్పిపుచ్చేందుకే తెలుగుదేశం అమరావతి పాదయాత్ర పేరిట కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు.