విశాఖ జిల్లాలో ఆరోపణలున్న భూ అక్రమాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) స్వాగతిస్తున్నామని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందన్న విశ్వాసం ఉందని ఆయన ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. విచారణ నివేదికను ప్రజల ముందు బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవానికి సిట్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం గుర్తు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న అద్భుత నగరం విశాఖలో ఇలాంటి వాటికి అవకాశం ఉండకూడదన్నారు.
విశాఖలోని భూ అక్రమాలపై వేసిన సిట్‌ను స్వగతిస్తున్నాం : గంటా - gantasrinivasa rao welcomes sit in vizag
విశాఖ జిల్లాలోని భూ అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్‌ను స్వాగతిస్తున్నామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందన్న విశ్వాసం ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.
![విశాఖలోని భూ అక్రమాలపై వేసిన సిట్‌ను స్వగతిస్తున్నాం : గంటా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4793786-447-4793786-1571408188077.jpg)
విశాఖలోని భూ అక్రమాలపై వేసిన సిట్‌ను స్వగతిస్తున్నాం
ఇదీ చదవండి :