విజయవాడ సంగీత కళాశాలలో ఘంటసాల మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. విశాఖలోని బాలల ప్రాంగణంలో ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 97వ జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఫిబ్రవరి 11 నుంచి వారం రోజులపాటు ఘంటసాల సంగీత వారోత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఘంటసాల పేరు గిన్నీస్ బుక్‌లో నమోదయ్యేందుకు కృషి చేస్తామన్నారు. మరో రెండు సంవత్సరాల్లో ఘంటసాల శత జయంతి రానున్నదని.. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.
ఘనంగా ఘంటసాల 97వ జయంత్యోత్సవాలు - ఘనంగా ఘంటసాల 97వ జయంత్యోత్సవాలు
విశాఖ జిల్లాలోని బాలల ప్రాంగణంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు... ఘంటసాల వెంకటేశ్వరరావు 97వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ సంగీత కళాశాలలో ఘంటసాల మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రకటించారు.
విశాఖలో ఘంటసాల 97వ జయంత్యోత్సవాలు