విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే సంతోషమేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజధాని అంశాలపై విశాఖ తెదేపా నేతలు చర్చించారు. అమరావతిలో రైతులకు న్యాయం చేసి తీరాలని గంటా అన్నారు. రాజధాని విశాఖకు నిజంగా వస్తుందో.. లేక రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేస్తున్నారోచూద్దామన్నారు. రాజధాని పేరుతో ప్రశాంత నగరంలో అరాచక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని గంటా అభిప్రాయపడ్డారు.
నిజంగా రాజధాని వస్తుందా... పొలిటికల్ గేమా.. చూద్దాం: గంటా - గంటా శ్రీనివాసరావు న్యూస్
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం సంతోషం కలిగించేదేనని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ganta srinivasarao on three capitals