ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ఉక్కుపై పవన్ స్పందించాలి.. భాజపా నేతలు పోరాటానికి కలసి రావాలి'

విశాఖ ఉక్కుపై అందరం కలిసి పోరాడాలని.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర భాజపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు.

ganta
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గంటా శ్రీనివాస్

By

Published : Mar 9, 2021, 12:14 PM IST

Updated : Mar 9, 2021, 12:41 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గంటా శ్రీనివాస్

విశాఖ ఉక్కుపై కేంద్రం వైఖరిని ప్రధాన మంత్రి స్వయంగా చెప్పారని... ఈ విషయంపై అందరం కలిసి పోరాడాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పెద్దలు మాత్రం ఇంకా ఏమీ జరగలేదంటూ.. తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విషయాన్ని ముగిసిన అధ్యాయమని ఆర్థిక మంత్రి అన్నారనీ... రాష్ట్రానికి సైతం సమాచారం అందిస్తున్నామని నిర్మలాసీతారామన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు... సీఎంతో కలిసి పనిచేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణకు.. రాష్ట్ర భాజాపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలని గంటా శ్రీనివాస్ అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాడేందుకు దిల్లీలో పాదయాత్రకు తాము సిద్ధంగా ఉన్నారనీ.. అందరూ కలిసిరావాలని గంటా పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రధానిని కలిసినప్పుడు... ఉక్కు విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

స్టీల్​ప్లాంట్​పై పవన్​ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల తరఫున జనసేన అధినేత పోరాడాలని గంటా శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందనీ... కార్యచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎం జగన్​ను కోరుతున్నామన్నారు. రాజీనామా చేస్తే.. తెదేపా పోటీ పెట్టబోదని గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఉద్రిక్తంగా మారిన విశాఖ ఉక్కు ఉద్యమం

Last Updated : Mar 9, 2021, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details