విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం జంపెన సమీపంలోని వంతెన వద్ద షెడ్లో నిల్వచేసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. మాడుగుల పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు చేశారు. 194 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకి తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.
194 కేజీల గంజాయి స్వాధీనం.. 6 గురు అదుపులో - paderu
ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని మాడుగుల పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి
Last Updated : Aug 30, 2019, 7:20 AM IST