విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎం.కే పట్నం సమీపంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాలపై తరలించడానికి సిద్ధం చేసిన 80 కిలోల సరుకును పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మాటువేసి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
80 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్ - విశాఖ జిల్లా ఎంకే పట్నంలో గంజాయి స్వాధీనం వార్తలు
విశాఖ జిల్లా ఎం.కే పట్నం సమీపంలో పోలీసులు 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చెయ్యగా.. మరొకరు పరారీలో ఉన్నాడు.
గంజాయి స్వాధీనం