తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన రాకేష్ , హనుమకొండకు చెందిన నయీమ్... గంజాయితో రాష్ట్ర పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన గూడెంకొత్తవీధి మండలం దారకొండలో 200 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ సరకును టాటా సుమోలో తరలిస్తుండగా... జెన్‌కో చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ మన్యంలో గంజాయి పట్టివేత - విశాఖపట్నం క్రైం
విశాఖపట్నం జిల్లా సీలేరు ఏజెన్సీలో గంజాయి తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ మన్యంలో గంజాయి పట్టివేత