ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఏజెన్సీలో ... 193 కిలోల గంజాయి పట్టివేత!

విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి ఆటోలో తరలిస్తున్న 193 కిలోల గంజాయిని గొలుగొండ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నమని, గంజాయిని తీసుకువెళ్తున్న ఆటోతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

GANJAI-PATTIVETHA
193 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Jul 21, 2021, 9:46 AM IST

ఎన్నిసార్లు పట్టుబడినా... విశాఖ ఏజెన్సీలో గంజాయి తరలింపు చాటుమాటుగా కొనసాగుతునే ఉంది. విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి ఆటోలో తరలిస్తున్న 193 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాయపట్నం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జోగంపేట వైపు వస్తున్న ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందింది.

ఆటోను తనిఖీ చేయగా 193 కిలోల గంజాయిని పట్టుబడిందని గొలుగొండ ఎస్సై తెలిపారు. ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు గొలుగొండ ఎస్ఐ ధనుంజయ నాయుడు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ఐదు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

చింతపల్లి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కిలో రాంబాబు అనే ఆటో డ్రైవర్​ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆటోకి ముందు ప్రయాణిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసే ప్రయత్నంలో వాహనాలపై ఉన్న వ్యక్తులు పరారయ్యారని, ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్​కు తరలించామని అని ఎస్ఐ తెలిపారు.

ఇదీ చదవండి:

janasena: జనసేనల నిలువరింత.. ఎందుకీ నిర్బంధమని నేతల ఆగ్రహం!

ABOUT THE AUTHOR

...view details