ఏజెన్సీ ప్రాంతం నుంచి రెండు కిలోల ద్రవ గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, రూ. 2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెదబయలు మండలానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమ గంజాయి తరలింపు పట్టివేత - పెందుర్తి తాజా వార్తలు
పెందుర్తి రహదారిలో అక్రమ గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల ద్రవ గంజాయిని పట్టుకున్నారు.
![అక్రమ గంజాయి తరలింపు పట్టివేత ganjai caught by pendurthi police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9023210-937-9023210-1601639124129.jpg)
రెండు కిలోల ద్రవ గంజాయి పట్టివేత