విశాఖ జిల్లా గొలుగొండ మండలం పుత్తడి గైరంపేట గ్రామంలో గంజాయి స్మగ్లర్లు అర్ధరాత్రి హల్ చల్ చేశారు. గంజాయితో నింపిన వాహనం తరలిస్తుండగా గ్రామంలో టైర్ పంచర్ అయ్యింది. విషయాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో అందులో ఉన్న నలుగురు గంజాయి స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు.
పంచరైన టైర్.. పరారైన గంజాయి స్మగ్లర్లు - ganja smuglers at goligonda
విశాఖ జిల్లా గొలుగొండ మండలం పుత్తడి గైరంపేట గ్రామంలో అర్థరాత్రి గంజాయి తరలిస్తున్న వాహనం పంచరైంది. గ్రామస్తులు అక్కడికి చేరుకోగా.. స్మగ్లర్లు తప్పించుకున్నారు.
గంజాయి తరలిస్తున్న వాహనం
వాహనాన్ని వదిలేసి తప్పించుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి తుని రైల్వే స్టేషన్ కు తరలిస్తుండగా.. పుత్తడి గైరంపేట వద్ద వాహనం టైర్ పంచర్ అయింది. ఈ వాహనంలో సుమారు రెండు వందల కిలోల వరకు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయన్న గ్రామస్తులు.. విషయాన్ని పోలీసులకు తెలిపామన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు