అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాటీరోడ్డు కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో గంజాయిని గుర్తించారు. గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కారు మన్యం ప్రాంతం నుంచి వచ్చినట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.
'కారులో 25 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుడి అరెస్ట్' - విశాఖ జిల్లాలో కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాటీరోడ్డు కూడలిలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఒక కారులో గంజాయి పట్టుబడింది. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
కారులో గంజాయి
గంజాయి తరలిస్తున్న కోటావురట్లకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, 25 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కారు సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి:'సచివాలయాలు మరింత మెరుగ్గా పని చేయాలి'