ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GANJA SMUGGLING IN VISAKHA DISTRICT : అక్రమార్కుల కొత్త పుంతలు...కుక్కీల రూపంలో గంజాయి తరలింపు - visakha district crime

Ganja smuggling in visakha district : గంజాయిని రవాణా చేసేందుకు అక్రమార్కులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గంజాయిని ఏకంగా బేకరీలో అమ్మే కుకీస్ రూపంలో తయారుచేసి సప్లై చేస్తున్నారు. విశాఖలో వెలుగుచూసిన ఈ ఘటన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులను ఆశ్చర్యపరిచింది.

కుక్కీల రూపంలో గంజాయి తరలింపు
కుక్కీల రూపంలో గంజాయి తరలింపు

By

Published : Dec 2, 2021, 2:36 AM IST

Ganja smuggling in visakha district : విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ, ఉషోదయ కూడలి వద్ద ముందస్తు సమాచారం మేరకు ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బొడ్డు ఆదిత్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయితో తయారు చేసిన 17 కుక్కీలు దొరికాయి. తాను కుటుంబంతో కలిసి కాశీకి వెళ్ళినప్పుడు 22 గంజాయ్ కుకీలను కొనుగోలు చేసినట్టు ఆదిత్య తెలిపాడు. నిందితుడి నుంచి 17 కుకీలు, ఓ చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details