ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరుకు బట్టల వ్యాపారం... చేసేది గంజాయి దందా..! - vizag police seized large scale ganja

బట్టల వ్యాపారం మాటున గుట్టుగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న ఐదుగురిని... విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. 400 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

భారీగా గంజాయి స్వాధీనం

By

Published : Nov 2, 2019, 5:49 PM IST

బట్టల వ్యాపారం ముసుగులో... గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది నుంచి ఎవరికీ అనుమానం రాకుండా... అద్దెకు తీసుకున్న ఇంటినుంచి గంజాయి సరఫరా చేసేవారు. గంజాయి వాసన బయటకు రాకుండా ఉండేందుకు... తలుపులు, కిటికీలకు టేపులు అంటిచారు. గది బయట ఒక మెషిన్ వంటి ఫ్యాన్ అమర్చి... దాని ద్వారా సెంటు వాసన వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. ఇలా ఎంత గోప్యంగా వ్యవహరించినా... పోలీసులు ఎత్తులను చిత్తుచేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లని, కేరళకు చెందిన ప్రధాన నిందితుడు అలెక్స్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

... మరిన్ని వివరాలు సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి అందిస్తారు...

భారీగా గంజాయి స్వాధీనం

ఇదీ చదవండి: ఇసుక కోసం.. నర్సీపట్నంలో ఆందోళన

ABOUT THE AUTHOR

...view details