విశాఖ జిల్లా చోడవరం పోలీసులు రెండు వేర్వేరు చోట్ల 938 కిలోల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు చరవాణులు, రవాణాకు ఉపయోగించిన ఓ ద్విచక్ర వాహనం, బొలెరో వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. బొలెరో వాహనంలో జోలపుట్ నుంచి అనకాపల్లి జాతీయ రహదారికి వద్దకు తీసుకెళుతుండగా.. గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు.
కోటిన్నర విలువ చేసే గంజాయి పట్టివేత .. నలుగురు అరెస్ట్ - chodavaram ganja cought news
విశాఖ జిల్లాలో వేర్వరు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు 938 కిలోల గజాయిని పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ కోటిన్నర ఉంటుందని పోలీసులు తెలిపారు.
ganja cought news