ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి కేసులో ఇద్దరు అరెస్టు.. తెల్లారేలోగా ఓ నిందితుడు మాయం - Ganja Seized in Anakapalli district

Marijuana Offender Escaped From Prison: విశాఖలో గంజాయి కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఓ నిందితుడు కొన్ని గంటల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఆలస్యంగా తేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో చోట 1200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక.. అమ్మాయిలను కామెంట్ చేశారన్న నెపంతో ఆడ పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు బాలురను స్తంభానికి కట్టేసి కొట్టడంపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.

Marijuana Offender Escaped From Prison
జైలు నుంచి తప్పించుకున్న గంజాయి నేరస్థుడు

By

Published : Apr 8, 2023, 9:56 PM IST

Updated : Apr 8, 2023, 10:41 PM IST

Marijuana Offender Escaped From Prison : విశాఖలో గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఓ నిందితుడు.. కొన్ని గంటల్లోనే బేడీలతో తప్పించుకున్నాడు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. శుక్రవారం రాత్రి ఒక ఎన్​డీపీఎస్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం ఇద్దరినీ 4వ పట్టణ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. కాగా, రాత్రి వారిద్దరికి బేడీలు వేసి స్టేషన్ లో ఉంచారు. వీరిలో లక్ష్మీపురం గ్రామం చోడవరం మండలం అనకాపల్లి జిల్లాకు చెందిన సియాధుల సత్తిబాబు.. ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఉమెన్ కానిస్టేబుల్ జయలక్ష్మిని నెట్టేసి బేడీలతో సహా తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఆ నిందితుడిని వెతికి పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

1200 కిలోల గంజాయి స్వాధీనం :అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ మన్యం నుంచి హైదరాబాద్​కి లారీలో గంజాయిని రవాణా చేస్తున్నారు. ఈ లారీ వెనుక వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ టైరు పేలిపోవడంతో లారీ ఆగిపోయింది. కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వచ్చిన పోలీసులు గంజాయి వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్​ని అదుపులోకి తీసుకున్నారు. ఎలమంచిలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 30 లక్షల పైనే ఉంటుంది. రోడ్డు ప్రమాదమే గంజాయిని పట్టించిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగి ఉండకపోతే దర్జాగా గంజాయి రవాణా అయి ఉండేదని, జాతీయ రహదారిపై దర్జాగా గంజాయి రవాణా చేయడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఆడ పిల్లల్ని కామెంట్ చేశారని...పాఠశాలలో ఆడ పిల్లల్ని కామెంట్ చేశారంటూ ఆరో తరగతి చదువుతున్న మగ పిల్లల్ని కొట్టిన ఘటన విశాఖలో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం పాఠశాల వదిలిన వెంటనే అటుగా స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలో డ్రైవర్ ని అడిగి ఎక్కారు. ఆటోలో ఉన్న ఆడ పిల్లల్ని అవమానించారని, ఆడ పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పారు. వారు మగ పిల్లల్ని స్తంభానికి కట్టేశారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టారు. కొంత సమయం తర్వాత ఇంటికి పంపించి వేశారు. మగపిల్లలు జరిగిన విషయమంతా వారి తల్లిదండ్రులకు వివరించారు. చిన్న పిల్లలు తప్పు చేస్తే మందలించి పంపించాలే కానీ, స్తంభానికి కట్టేసి కొట్టడం ఏమిటని బాలుర తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా.. ఒకరు మృతి : అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వజ్రకరూరు మండలం పిసి కొత్తకోటకు చెందిన గంగన్న మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన మరో నలుగురికి గాయాలు అయ్యాయి. కొత్తకోట గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు పాల్తూరు గ్రామంలోని మిరప తోటలో పనులకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బళ్లారి జాతీయ రహదారిలో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడటంతో స్థానిక ప్రజలు గమనించి పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి : అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని సతీష్(25 ) అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామానికి చెందిన ఆటోలో గొర్రెల లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓబులేష్, సీనప్ప, నందు అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, నందు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ హాస్పిటల్​కి తీసుకెళ్లారు. ఆటోలోని 8 గొర్రెలు మృతి చెందాయి.

ఉత్సవాల్లో అపశృతి :అన్నమయ్య రాజంపేట పట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. స్వామి వారి ఊరేగింపు శివాలయం వద్దకు చేరగానే అక్కడున్న యువకులు బాణాసంచా పేల్చారు. టపాసులు ప్రమాదవశాత్తు పేలి పలువురు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 8, 2023, 10:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details