ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GANJA CULTIVATION: ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు..ఆ మొక్కలు పెంచేస్తున్నారు - ap ganja news

కొండలు, గుట్టలు, అడవులు దగ్గరగా ఉన్న చేలు, చెలకల్లో గంజాయి మొక్కలు పెంచుతుండటం మనకు తెలిసిన విషయమే. కానీ ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే సాగు చేస్తున్నారు కొందరు అక్రమార్కులు.

ganja-cultivation-in-government-hospital-building-at-vishaka-district
స‌ర్కారు ద‌వాఖానలో గంజాయి వ‌నం

By

Published : Sep 7, 2021, 10:46 PM IST

అనారోగ్యానికి గురైనవారు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఆస్పత్రి పరిసరాల్లో పచ్చని వాతావరణం ఉండాలని కోరుకుంటారు. కానీ విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో మధ్యలో నిలిచిపోయిన ఆసుపత్రులు గంజాయి సాగుకు కేరాఫ్​ అడ్రస్​గా మారుతున్నాయి. విశాఖ జిల్లా మ‌న్యం చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీని చుట్టూ కొందరు అక్రమార్కులు గంజాయి మొక్కలను పెంచుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామస్థులు చూసినవారంతా.. ఆస్పత్రి ఆవరణలో విషపు పంట పండించడమేమిటా అని ముక్కున వేలేసుకుంటున్నారు తప్ప ఎవ్వరూ ఏం చేయలేని దుస్థితి నెలకొంది.

చింత‌ప‌ల్లి మండ‌లం బలపం పంచాయతీలో మొత్తం 33 గ్రామాలున్నాయి. వీటిలో చాలా గ్రామాలు ఒడిశా సరిహద్దున ఉన్నాయి. మౌలిక వసతులకు దూరంగా ఉన్న గ్రామంలో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. ఇతర పంటలతో పోలిస్తే రెట్టింపు ఆదాయం వస్తున్నందున ఆదివాసీలు ఎక్కువగా గంజాయి మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో అధికారులు ఈ గ్రామాల పర్యటనకు ఎక్కువగా రారు. పోలీసు బలగాలు అప్పుడప్పుడు గాలింపు చర్యలకు వస్తున్నా.. గంజాయి సాగు, తోటల ధ్వంసంపై దృష్టి సారించరు.

గంజాయి వ్యాపారులు ముందుగా పెట్టుబడులు పెట్టి మరీ గిరిజనులతో సాగు చేయిస్తున్నారు. దీంతో ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు.. ఓ నాలుగు గంజాయి మొక్క‌లు వేస్తే పోలా... అలా పెరిగి పడుంటాయ‌ని గిరిజ‌నులు ఖాళీ ప్ర‌దేశాల‌ను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రం కోసం నిర్మిస్తున్న భ‌వ‌నం చాలా కాలంగా అసంపూర్తిగా ఉంది. దీంతో గుర్తు తెలియ‌ని వ్య‌క్త‌ల క‌న్ను ఈ ఖాళీ ప్ర‌దేశంపై ప‌డింది. వెంటనే గంజాయి సాగు చేయడం ప్రారంభించారు. ఎవరూ ఆపేవాళ్లు, అడిగే వాళ్లు లేకపోవడంతో గంజాయి మొక్కలు ఏపుగా పెరిగాయి.

కోరుకొండలో ప్రభుత్వ ఆసుపత్రి దశాబ్దాలుగా రేకుల షెడ్డులో కొనసాగుతోంది. పక్కా భవనానికి నిధులు మంజూరైనా బిల్లులు మంజూరుకాక గుత్తేదారు పనులను మధ్యలో నిలిపివేశారు. అసంపూర్తిగా ఉండిపోయిన ఆసుపత్రి చుట్టూ గంజాయి మొక్కలు ఏపుగా పెరిగాయి.

ఇప్పటికైనా అధికారులు

విశాఖ మ‌న్యంలో గంజాయి సామ్రాజ్యం ఎలా వేళ్లూనుకుంటుందోన‌న్న విష‌యాన్ని ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

ఇదీ చూడండి:Vinayaka Chavithi controversy: చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు.. తగ్గేదేలేదంటున్న విపక్షాలు!

ABOUT THE AUTHOR

...view details