విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని రెడ్డిపాలెం వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 25 కిలోల ద్రవ రూప గంజాయిని నర్సీపట్నం డివిజన్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు పట్టుకున్నారు. జి.మాడుగుల మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి ద్విచక్ర వాహనంతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ద్రవరూప గంజాయి తెలుగు రాష్ట్రాల్లో కిలో లక్ష రూపాయల వరకు ఉండగా ఇతర రాష్ట్రాల్లో దీని విలువ 5 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.
25 కిలోల ద్రవరూప గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్ - రెడ్డిపాలెం వద్ద ద్రవరూప గంజాయి పట్టివేత
అనునిత్యం జల్లెడపడుతున్నా... గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. పోలీసుల కళ్లుగప్పేందుకు అక్రమదారులు కొత్తకొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. విభిన్న మార్గాల్లో గంజాయి తరలిస్తూ దొరికిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలో ద్రవరూపంలో గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
![25 కిలోల ద్రవరూప గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్ ganja cought in reddypalem vishakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12926192-470-12926192-1630394211149.jpg)
ganja cought in reddypalem vishakhapatnam district