విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ శివారు కళ్యాణలోవ జలాశయం సమీపంలో.. వాహనాల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతాల నుంచి పట్టణాలకు గంజాయిని తరలించటానికి ప్రయత్నిస్తుండగా.. దాడులు చేసి 414 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కొత్తకోట పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరూ జెడ్పీ గన్నవరం గ్రామానికి చెందినవారిగా గుర్తించామనీ.. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కొత్తకోట ఎస్సై దామోదర నాయుడు వివరించారు.
414 కిలోల గంజాయి స్వాధీనం...ఇద్దరు నిందితులు అరెస్టు - చీమలపాడు గంజాయి న్యూస్
గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీ శివారులో జరిగింది.
![414 కిలోల గంజాయి స్వాధీనం...ఇద్దరు నిందితులు అరెస్టు ganja caught by police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8884430-81-8884430-1600695757942.jpg)
గంజాయి స్వాధీనం స్వాధీనం