విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండ కూడలి వద్ద 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.14 వేల నగదు, రెండు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో వున్నా కారులను పోలీసులు సీజ్ చేశారు.
100 కిలోల గంజాయి పట్టివేత - ganja caught at vishaka district
విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండ కూడలి వద్ద సుమారు రూ. 4లక్షలు విలవ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
100 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి విలువ సుమారు నాలుగు లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరు గంజాయిని ఎక్కడ కొనుగోలు చేసింది? ఎక్కడికి తరలిస్తున్నది ? అనే వివరాలకోసం విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కోర్టులపై అభ్యంతరకర పోస్టులు... సీబీఐ కేసు