విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న కారు గిరిజనులను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో ఉన్న గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. దీంతో గిరిజనులు కారును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
బైక్‌ను ఢీకొట్టిన గంజాయి స్మగ్లింగ్ కారు.. ముగ్గురికి తీవ్రగాయాలు - vishakha crime news
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరగ్గా.. కారులో ఉన్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు.
అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని చినబంధవీదికి చెందిన జి.పాపారావు, బి.సోమరాజు, నేరేడువీధికి చెందిన సూరిబాబు ద్విచక్రవాహనంపై అన్నవరం వెళ్తున్నారు. లోతుగెడ్డ నుంచి పాడేరు వెళుతున్న కారు పనసపాడు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది . దీంతో గంజాయి స్మగ్లర్లు కారును విడిచిపెట్టి పారిపోయారు. స్థానికులు కారును పరిశీలించగా డిక్కిలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి అన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు లోతుగెడ్డ ఆసుపత్రికి తరలించారు. గెమ్మిలి పాపారావుకి బలంగా గాయపడటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:విశాఖలో గంజాయి పట్టివేత... ఒడిశా కానిస్టేబుల్ అరెస్టు