విశాఖ మన్యం పాడేరు మండలం నక్కలపుట్టు వద్ద గంజాయితో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న గంజాయి రెండు బ్యాగులను చోదకులు తుప్పల్లో పడవేశారు. ఆటో బోల్తా పడిన వెంటనే స్థానికులు గుమిగూడి ఆటోలో గంజాయ్ ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో పాటు ఆటో ను స్వాధీనం చేసుకుని పాడేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన గంజాయి దాదాపు పది కేజీలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
ఆటో బోల్తా.. గంజాయి పట్టివేత.. - paderu news updates
విశాఖ మన్యం పాడేరులో మండలంలో గంజాయితో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సరకుతో పాటు ఆటోను సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ganja auto boltha in visakha dst paderu