ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుల్లేపల్లిలో కన్నులపండువగా గంగాదేవి గావు జాతర - gangadevi gavu jathara in gullepalli

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం గుల్లేపల్లిలో గంగాదేవి గావు జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు.

gangadevi gavu jathara
గంగాదేవి గావు జాతర మహోత్సవం

By

Published : Mar 23, 2021, 5:02 PM IST

కన్నులపండువగా గంగాదేవి గావు జాతర మహోత్సవం

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం గుల్లేపల్లిలో గంగాదేవి గావు జాతర మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పూర్వీకుల నుంచి యాదవ కులస్థులు ఈ జాతరను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు రోజులుగా గంగాదేవి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

జాతరలో తప్పెడు గుళ్ల పోటీలను నిర్వహించారు. భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఆలయం ముందు వేసిన చలువ పందిళ్లకు భక్తులు కరెన్సీ నోట్లు, కొబ్బరి, అరటి గెలలను వేలాడదీశారు. జాతరలో చలువ పందిళ్లకు కట్టిన గెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details