కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. నగరంలో పర్యటించిన ఆయన జీవీఎంసీ సూచించిన ప్రత్యేక సూట్‌ను ధరించి కార్మికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. కరోనా నివారణలో భాగంగా సబ్బులు, మాస్కులు, హోమియోపతి మందులను పంపిణీ చేశారు. వైరస్ ప్రబలకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
'కరోనా వ్యాప్తి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి' - gvmc
విశాఖపట్నం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే గణేష్ కుమార్ అన్నారు. జీవిఎంసీ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
మాస్కులు పంపిణీ చేస్తున్న విశాఖపట్నం ఎమ్మెల్యే గణేష్ కుమార్