కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా... ఇంటి నుంచి బయటకు రావద్దంటూ గాజువాక పోలీసులు ప్రజలకు విన్నవించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జంక్షన్లో వాహనదారులకు నమస్కరించి.. బయటకు రావద్దు.. ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండండి అంటూ... బయటకు వచ్చిన వారికి చెప్పారు.
ఇది పోలీసుల విన్నపం... మీరూ వినండి..! - కరోనాపై విశాఖ పోలీసులు అవగాహన
ఇంట్లోనే ఉండండి. అవసరమైతే తప్పా బయటకు రాకండి అని ఎంత చెప్పినా కొందరు వినడం లేదు. అందుకే విశాఖలోని గాజువాక పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ప్రజలకు నమస్కరించి అవగాహన కల్పించారు.
gajuwaka police awarness on corona virus and lockdown in visakha