విశాఖ మన్యంలో కలుషిత నీరు తాగి ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు పోలీసులు తమ వంతు సాయం అందించారు. జి. మాడుగుల మండలం నుర్మతి గ్రామంలో మినరల్ వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాలంలో తాగనీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీఐ జేడీ బాబు తెలిపారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గిరిజనులకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని... ఏ సమస్య వచ్చిన తమకు సమాచారం అందించాలంటూ సూచించారు.
విశాఖ ఏజెన్సీలో మినరల్ వాటర్ ట్యాంక్ ప్రారంభించిన పోలీసులు - visakha agency latest news
తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు జి. మాడుగుల మండలం పోలీసులు నుర్మతి గ్రామంలో మినరల్ వాటర్ ట్యాంక్‌ను ఆదివారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఐ బాబు తెలిపారు.

మంచినీటి సౌకర్యం కల్పించిన విశాఖ మన్యం పోలీసుల