విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 80 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 863.98 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు అరకు ఎంపీ మాధవి తెలిపారు. ఈ నిధులతో పాడేరు, అరకు, సాలూరు గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. పాడేరు నుంచి గుండిగుడ వరకు 49.37 కిలోమీటర్లు పొడవునా 571 కోట్ల రూపాయలతో రహదారి నిర్మిస్తామన్నారు. సాలూరు నుంచి గజపతినగరం వరకు 32.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 221 కోట్ల రూపాయలు కేటాయించారని ఆమె తెలిపారు.
రహదారుల నిర్మాణానికి రూ.863 కోట్లు మంజూరు
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 80 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 863.98 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఎంపీ మాధవి తెలిపారు. ఈ నిధులతో గిరిజన ప్రాంతాల్లో రోడ్డు వేయిస్తామని చెప్పారు.
funds released
తాను ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గం పరిధిలో రహదారులు లేక గిరిజనులు పడుతున్న కష్టాలను పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ మాధవి తెలిపారు.