ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధ్వంసమైన సాగునీటి వనరులకు ఆరకొర నిధులు..! - విశాఖ జిల్లా తాజా వార్తలు

వరదలు వచ్చినప్పుడే అధికారులు, నాయకులు హడవుడి చేస్తుంటారు. సాగునీటి వనరులు ధ్వంసం అయితే తాత్కాలిక, శాశ్వత ప్రతిపాదికన అంచనాలు తయారు చేయమంటారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టేసరికి వాటిని కనీసం పట్టించుకోరు. దీంతో కార్యరూపం దాల్చకముందే మరో ముంపు వచ్చి పడుతుంది. గత ఏడాది వరదల విషయంలో జలవనరుల శాఖ ఇదే పనిచేసింది. గత ఏడాది వరదల కారణంగా సాగునీటి వనరులు ధ్వంసం అయ్యాయి. వాటి మరమ్మత్తు కోసం 90 కోట్ల ప్రతిపాదనలు పంపితే అందులో 10 శాతం నిధులు మాత్రమే సర్కార్ మంజూరు చేసింది.

ధ్వంసమైన సాగునీటి వనరులకు ఆరకొర నిధులు..!
ధ్వంసమైన సాగునీటి వనరులకు ఆరకొర నిధులు..!

By

Published : Oct 17, 2020, 11:13 AM IST

ఈ ఏడాది వరదలకు మరోసారి సాగునీటి వనరులు ధ్వంసమయ్యాయి. వాటన్నింటినీ అంచనాలు తయారు చేయడానికి జలవనరుల శాఖ అధికారులు మరోసారి సిద్ధమవుతున్నారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వరద గేట్లు రూపురేఖలు మారిపోయాయి. వాటి తాత్కాలిక మరమ్మతులకు 6 కోట్లు, శాశ్వత ప్రాతిపదికన బాగు చేయడానికి 90 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. నెలలు గడిచినా వాటికి నిధులు కేటాయింపు జరగలేదు. సాధారణంగా వేసవిలోనే సాగునీటి వనరుల పనులు చేపట్టాలి. లేకుంటే నీటి ప్రవాహాల కారణంగా పనులకు ఆటంకం ఏర్పడుతుంది. గతేడాది వరద నష్టం పనులకు 90 కోట్ల తో ప్రతిపాదనలు పంపిస్తే , ఏడాది కాలంలో కేవలం 90 లక్షలు మంజూరు చేశారు. వాటితోనూ పనులు చేయించే లేకపోయారు. అడిగినంత సకాలంలో ఇచ్చి ఆ పనులు చేయించి గలిగితే కొంతవరకైనా మేలు జరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు.

గత వరదల్లో సోము దేవులపల్లి వద్ద మూలపాలెం గ్రోయింగ్ గోడ నిర్మాణానికి 4.5 లక్షలు మే నెలలో ఇచ్చారు. ఈ పనులకు టెండర్లు పిలిస్తే గుత్తేదారు ముందుకు వచ్చి పనులు చేయలేమని చేతులెత్తేశారు. దీనివలన మరోసారి టెండర్లు పిలవాల్సి ఉంటుంది . తాజా వరదలకు అదే గ్రౌండ్ పరిసరాలకు మరింత నష్టం వాటిల్లింది. ఆగస్టు నెలలో రాంబిల్లి మండలం గోకివాడ గడ్డ సమీపంలో ఏడు మల్ల డ్యాం మరమ్మతులకు 11 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ పనులు మొదలు కాలేదు. అదే మండలం గురజాల పెద్ద కాపుల పల్లి వద్ద గోకివాడ గడ్డలో సముద్ర జలాలు కలవకుండా చేయడానికి నాలుగు లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు మొదలు పెట్టలేదు. తాజాగా అదే డ్యాం వద్ద వరద కు వేల ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. సెప్టెంబర్ నెలలో ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు డ్యామ్ మరమ్మతులకు 39 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటికే వర్షాకాలం మొదలవడంతో ఆ పనులు జోలికి పోలేదు. దీంతో జలవనరుల శాఖ పరిధిలో చేపట్టాల్సిన పనులు నిధులకు సంబంధించి ప్రభుత్వం సంధించి సకాలంలో అవసరమైన నిధులు మంజూరు చేస్తే వద్ద నష్టాలు జరగకుండా కొంతవరకు నివారణ చర్యలు చేపట్టవచ్చని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీచదవండి

శాంతిస్తున్న శారదా నది... ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details