కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఏవోబీలోని కోరాపుట్ జిల్లాలో నెల రోజులు పాటు వారాంతం శని, ఆదివారాల్లో సంపూర్ణంగా లాక్డౌన్ విధించారు. సరిహద్దులోని ఓనకడిల్లి, మాచ్‌ఖండ్, జోలాపుట్ గ్రామాల్లో దుకాణాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ మూసేశారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు జులై నెల మొత్తం ఇదే పద్ధతి పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏవోబీలో ఇకనుంచి శని,ఆదివారాలు అన్నీ బంద్ - విశాఖ జిల్లా ఒడిశా సరిహద్దుల తాజా వార్తలు
కరోనా మహమ్మారి వ్యాప్తిచెందకుండా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా జనసమూహం ఉండే ప్రాంతాల్లో సంచారం తగ్గించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏవోబీలో ఒడిశా ప్రభుత్వం ఈ నెల అంతా శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

full lockdown in visakha boarder AOB