విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో తెదేపా నాయకులు ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం ప్రారంభించారు. సుమారు ఐదు వేలకు పైగా జనాభా ఉన్న రోలుగుంటలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ కాలనీ, తదితర ప్రాంతాలకు పంచాయతీ ద్వారా సరఫరా చేసే తాగునీరు సరిగా అందటం లేదు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక తెలుగు యువత నాయకుడు రామకృష్ణ.. అతని తాతయ్య సత్య నాయుడు జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కొద్ది రోజుల క్రితమే చేపట్టినప్పటికీ… అధికారికంగా వచ్చిన ఇబ్బందుల కారణంగా నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారుల సూచన మేరకు ట్యాంక్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కొప్పుల వరలక్ష్మి, ఉప సర్పంచ్ నరసింహమూర్తి పాల్గొన్నారు.
రోలుగుంటలో తాగునీటి సరఫరా ప్రారంభం - rolugunta latest news
విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో తెదేపా నాయకులు ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం ప్రారంభించారు. తాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యను తీర్చేందుకు ఈ పనికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఉచిత తాగునీటి సరఫరా ప్రారంభం
ఇదీ చదవండి:మర్లగుమ్మి ఆనకట్టకు మరమ్మతులు ఎప్పుడు ?