నెలవారీ ఆరోగ్య పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణులకు పౌష్టిక ఆహారం అందిస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు విశాఖ వాసి దేవవరపు రాజబాబు. పాయకరావుపేట మండంల శ్రీరాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా.. ప్రతి నెల తొమ్మిదో తేదీన పరీక్షల కోసం వచ్చే గర్భిణీ స్త్రీలకు కడపునిండా భోజనం అందిస్తున్నారు.
కష్టాలకు చలించారు... గర్భిణుల ఆకలి తీరుస్తున్నారు! - ఎందరో గర్భిణీ స్ర్రీల ఆకలి తీరుస్తున్నారు.
ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి నెల పది గ్రామాల నుంచి 150 మందికి పైగా గర్భిణులు వెళ్తుంటారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గంటల తరబడి వేచి చూస్తుంటారు. సమయానికి ఏమైనా తిందామనుకుంటే అందుబాటులో ఎలాంటి హోటళ్లు ఉండవు. ఈ పరిస్థితిని గమనించి దేవవరపు రాజబాబు... ప్రతి నెల 9వ తేదీన ఉచితంగా పౌష్టిక ఆహారం అందించేలా ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకుంటున్నారు.
పది గ్రామాల నుంచి రాక
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు పది గ్రామాల నుంచి ప్రతి నెల దాదాపు 150 మంది వరకు గర్భిణులు వస్తుంటారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించే వరకు సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది. సమయానికి భోజనం, టిఫిన్ చేద్దామన్నా.. ఎటువంటి హోటళ్లు అందుబాటులో ఉండవు. వారి అవస్థలు గ్రహించిన రాజబాబు.. ఆకలి తీర్చేలా పోషకాలతో కూడిన ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ భోజనంలో పప్పు, కాయగూరలు, ఆకుకూరలు, అరటిపండు పెరుగు వంటివి ఉండేలా చూస్తున్నారు. రాజబాబు దాతృత్వంపై గర్భిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
TAGGED:
free food distribute at PHC