విశాఖ జిల్లా చోడవరంలో కోవిడ్ 19 సందర్భంగా ఉచిత పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. మండంలంలో లాక్డౌన్ సందర్భంగా నిరాశ్రయులైన వారికి అందించే సాయం ఒకచోట నుంచి జరిగేలా పోలీసు ట్రైనీ డీఎస్పీ డా.రవికిరణ్ చర్యలు తీసుకున్నారు. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత పంపిణీ కేంద్రం నుంచి సరకులు అందజేస్తారు. ఇక నుంచి సాయం చేసే వర్గాలు మండల నోడల్ ఏజన్సీని సంప్రదించాలన్నారు. నోడల్ ఏజన్సీలో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసు ఎస్సై సభ్యులుగా ఉంటారు. నోడల్ ఏజన్సీ అనమతి లేకుండా ఏ ఒక్కరూ వ్యక్తిగత సాయాలు చేయరాదని ట్రైనీ డీఎస్పీ డా. రవికిరణ్ తెలిపారు.
నిరాశ్రయులకు ఉచిత సరుకుల పంపిణీ కేంద్రం ఏర్పాటు
చోడవరంలో లాక్డౌన్ సందర్భంగా ఉచిత పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన వారికి ఒకచోట నుంచే సాయం అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ ట్రైనీ డీఎస్పీ డా. రవికిరణ్ తెలిపారు.
చోడవరంలో ఉచిత పంపిణీ కేంద్రం ఏర్పాటు