ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాల పేరిట మోసం... రూ.38లక్షలతో పరార్​... - pendurti latest news

యువతలో నిరుద్యోగం పెరిగిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరుతో పలువురి దగ్గర డబ్బు వసూలు చేసి... ఉడాయించిన ఓ వ్యాపారిపై విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యాపారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

cheating
మోసానికి పాల్పడిన వ్యక్తి

By

Published : Jun 17, 2021, 8:40 PM IST

ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన సామినేని రామకృష్ణ అనే వ్యక్తి పాపయ్యరాజు పాలెంలో నివాసం ఉంటున్నాడు. అతను చినముషిడివాడలో ఆర్కే ట్రేడర్స్ పేరిట వ్యాపారం నిర్వహించేవాడు. ఆ ప్రాంతానికి చెందిన 16మంది యువకులకు.. ఉద్యోగం ఇచ్చి, నెలకు రూ.40 జీతం ఇస్తానని చెప్పాడు. అందుకుగాను వారి వద్ద నుంచి రూ.2లక్షలు వసూలు చేశారు.

సరుకుల విక్రయానికి సంబంధించి ఉద్యోగం ఇచ్చి.. కొన్నాళ్లు నెలకు రూ.25వేలు మాత్రమే జీతమిచ్చాడు. తన వద్ద డిస్ట్రిబ్యూటర్లుగా చేరితే మంచి ఆదాయం పొందవచ్చని ఆశ చూపాడు. తన వద్ద తక్కువ ధరకు వస్తువులు కొని... ఎక్కువ ధరకు విక్రయించవచ్చని నమ్మించాడు. సరుకుల కోసం యువకుల నుంచి మళ్లీ కొంత మొత్తాన్ని డిపాజిట్​ చేయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా యువకులకు మాత్రం సరుకులు అందలేదు. వారికి ఇవ్వాల్సిన నెలసరి జీతాలు కూడా వ్యాపారి ఇవ్వలేదు. చేసేది లేక బాధితులంతా రామకృష్ణ వద్దకు వెళ్లి ప్రశ్నించారు. దీంతో దుకాణం మూసివేసి వ్యాపారి పరారయ్యాడు.

బాధితుల నుంచి సుమారు రూ.38లక్షల మేర వసూలు చేసినట్లు గుర్తించామని సీఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారిని అరెస్టు చేసి.. తమ డబ్బు ఇప్పించాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:తెనాలి హత్య కేసులో నిందితుల అరెస్ట్ ..

ABOUT THE AUTHOR

...view details