Center for Gandhian Studies at Andhra University: అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్, హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ ప్రతినిధి ఫ్రాంకీ స్టర్మ్ ఆంధ్రా యూనివర్సిటీ గాంధీయన్ స్టడీస్ సెంటర్‌ను సందర్శించారు. వర్సిటీలో గాంధీయన్ అధ్యయన కేంద్రం, గ్రంథాలయం, ఇతర కార్యక్రమాలను ఆయన అభినందించారు. వర్సిటీ కేంద్రంలో గాంధీ సిద్ధాంతాలను బోధించడం సంతోషకరమన్నారు. తాను మహాత్మా గాంధీ గురించి పుస్తకాలు, రచనలను చదివానని తెలిపారు. 'విదేశీయుల దృష్టిలో గాంధీ' అనే పుస్తకాన్ని గాంధీయన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ చల్లా రామకృష్ణ.. ఫ్రాంకీ స్టర్మ్‌కు బహూకరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా కాన్సులేట్ మీడియా సలహాదారు డాక్టర్ మహ్మద్ అబ్దుల్ బాసిత్, డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ కేంద్రంలో గాంధీ సిద్ధాంతాలు బోధించడం సంతోషకరం: ఫ్రాంకీ స్టర్మ్ - ap news
Center for Gandhian Studies at Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రంలో గాంధీ సిద్ధాంతాలను బోధించడం సంతోషకరమని.. హైదరాబాద్ యూయస్ కాన్సులేట్ ప్రతినిధి ఫ్రాంకీ స్టర్మ్ అన్నారు. ఈరోజు వర్సిటీలో సందర్శించిన తరుణంలో... తాను మహాత్మా గాంధీ గురించి పుస్తకాలు, రచనలను చదివానని తెలిపారు.
ఏయూలో గాంధీయన్ స్టడీస్ సెంటర్