విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో నాలుగో విడత కరోనా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద కోవిడ్-19 నాలుగో విడత సర్వే స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఇలా చేయడం వలన ఎన్ని గృహాలు సర్వే చేశామన్న.. స్పష్టత ఉంటోందని మున్సిపల్ కమిషనర్ నామా కనకరాజు చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆ ఇంట్లో ఉంటున్న వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించి ఏరోజుకారోజు నివేదికలు అందిస్తున్నారన్నారు. నాలుగో విడత సర్వే పూర్తయితే మున్సిపాలిటీ పరిధిలో.. ఎంతమందికి కరనా సోకిందో నిర్ధరణ అవుతుందని చెప్పారు.
యలమంచిలిలో నాలుగో విడత ఇంటింటి సర్వే
కరోనా ఎవరి నుంచి వస్తుందో తెలియకుండా పోతోంది. ఈ నేపథ్యంలో అనుమానితుల్ని గుర్తించటం కష్టంగా మారింది. అందుకే అధికారులు ఇంటింటికీ వెళ్లి జల్లెడ పడుతున్నారు. సర్వే ద్వారా అనుమానితుల్ని వెతుకుతున్నారు.
Fourth Door-to-Door Survey on corona at yellamanchili in visakha