ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెందుర్తిలో విషనాగుల హల్​చల్ - snakes in pendurthi

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు విషనాగులు బుసలు కొడుతూ కనిపించాయి. ఇక అంతే అక్కడి వారికి పై ప్రాణాలు పైనే పోయాయి. పాములు చూసిన వారు స్నేక్ క్యాచర్​కు ఫోన్ చేసి రప్పించారు. వాటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

four snakes
పెందుర్తిలో విషనాగుల హల్​చల్

By

Published : Jun 19, 2020, 9:48 AM IST

విశాఖజిల్లా పెందుర్తిలో విషనాగులు హల్​చల్ చేశాయి. శారదా పీఠంలోకి , ప్రశాంతి నగర్ సబ్బవరం ఎండీవో ఆఫీస్ వద్దకు విషనాగులు వచ్చాయి. భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్​ గణేష్​కు ఫోన్ చేసి సమాచారం అందించారు.

పాములన్నింటినీ చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రోజే ఇలా నాలుగు విష నాగులు రావటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:'నాపై నమోదైన కేసును ఎత్తివేయండి'

ABOUT THE AUTHOR

...view details