ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు - విశాఖలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

విశాఖ నుంచి గంజాయి తరలిస్తున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 31 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Four people have been arrested for smuggling ganja at vishakapatnam
అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు

By

Published : Oct 5, 2020, 9:31 PM IST

విశాఖ మన్యంనుంచి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరంతా... విశాఖ జిల్లా ఘాట్ రోడ్డు కూడలి వద్ద పోలీలకు చిక్కారు.

నిందితుల నుంచి 31 కేజీల గంజాయి, కారు, ల్యాప్ టాప్, 2 వేల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details