విషాదం : చేపలవేటకు వెళ్లి నలుగురు కుటుంబసభ్యులు మృతి - vizag-district crime
19:43 November 07
మృతుల్లో తండ్రి, ఇద్దరు కుమార్తెలు
విశాఖపట్నం జిల్లా జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ చాపరాతిపాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు... తన కుమార్తెలు తులసి, లాస్య, మేనల్లుడు రమణతో కలిసి బొంతువలస గ్రామ సమీపంలోని కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లారు. గాలాలతో చేపలు పట్టే సమయంలో కాలువలో నీటి ఉద్ధృతి పెరిగి ప్రవాహంలో నలుగురూ కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నూకరాజు, తులసి, లాస్యల మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన రమణ మృతదేహం కోసం గాలిస్తున్నారు.
ఇదీచదవండి: 5K RUN : ఆవార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేన్సర్‌పై అవగాహన పరుగు