విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. జస్టిస్ కె. విజయలక్ష్మి, జస్టిస్ డి. రమేష్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ ఎం. గంగారావులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఈఓ సూర్యకళ, ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు.
SIMHADRI APPANNA: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు - ap latest news
విశాఖలోని సింహాద్రి ఆలయాన్ని నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. న్యాయమూర్తులకు వేదపండితులు తీర్థప్రసాదాలను అందజేశారు.
సింహాద్రి అప్పన్న దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
ఆలయానికి చేరుకున్న నలుగురు న్యాయమూర్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ సూర్యకళ న్యాయమూర్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను న్యాయమూర్తులకు వివరించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి తెలియజేశారు.
ఇదీ చూడండి:Ramoji film city: రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం