ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేజోన్‌ ఏర్పాటులో రాష్ట్రం చొరవ చూపడం లేదు.. భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌

Railway zone విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చొరవ చూపడంలేదని భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు. విశాఖలో రైల్వే జోన్‌ అవసరాలకు 25 ఎకరాల స్థలం అడిగితే ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. 2020-21 బడ్జెట్​లో 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం కేటాయించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్
New Railway Zone In AP

By

Published : Sep 30, 2022, 10:13 AM IST

New Railway Zone In AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంఖుస్థాపన త్వరలోనే జరుగుతుందని భాజాపా ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్​ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు లేకపోతే, నిధులు ఎందుకు కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. నిరాధారమైన లీక్​ల ఆధారంగా ఆవాస్తవ కథనాలు వస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రైల్వేమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు. విశాఖలో 25 ఏకరాల స్థలాన్ని దక్షిణ కోస్తా రైల్వేకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు స్పందించలేదని మాధవ్ ఆరోపించారు. 2020-21 బడ్జెట్ లో రూ. 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఇచ్చామన్నారు. ర్యాక్ సమస్య వల్ల కొత్త రైలు మొదలుకావడం ఆలస్యమైందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details