విశాఖ జిల్లా చోడవరంలో శ్రీ వినాయక ఫుట్ వేర్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ అవగాహన ర్యాలీ జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. జనాభా లెక్కలలో ఉందామా! కరోనా లెక్కలలో కనిపిద్దామా అంటూ నినదించారు. పట్టణంలో ర్యాలీ చేసి, నాలుగు రహదారుల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మీ నారాయణ, అటవీశాఖ అధికారి రామ్ నరేష్, ఫుట్ వేర్ వర్తకుల సంఘ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. చోడవరంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఫుట్ వేర్ సంస్థలు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.
జనాభా లెక్కలలో ఉందామా! కరోనా లెక్కలలో కనిపిద్దామా?
విశాఖ గ్రామీణ జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. అధికారులు, వివిధ ప్రజా సంఘాలు అప్రమత్తతయ్యారు. చోడవరంలో శ్రీ వినాయక ఫుట్ వేర్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ అవగాహన ర్యాలీ చేపట్టారు.
జనాభా లెక్కలలో ఉందామా! కరోనా లెక్కలలో కనిపిద్దామా