విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిని కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శన భాగ్యం కల్పించి.. వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందించారు. స్థలపురాణం, ఆలయంలో జరుగుతున్న విశేష పూజలను ఆయనకు వివరించారు.
ఆలయంలో గల శిల్పకళలను, స్వామివారి వాహనాలను పరిరక్షిస్తున్న తీరును సారంగి ప్రశంసించారు. ముూడు రోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో సారంగి పదవిని కోల్పోయారు. ఎంపీ సారంగితో పాటు నీతి ఆయోగ్ డైరెక్టర్ మనోజ్ ఉపాధ్యాయ, పంజాబ్ ప్రభుత్వ సలహాదారు శంకర్ ప్రసాద్... స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా.. భక్తులకు సాఫీగా దర్శనాలు కల్పిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు.