విశాఖ జిల్లా చీడికాడ మండలం బొడ్డేరు నదిపై ఉన్న మర్లగుమ్మి ఆనకట్ట గండిని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పరిశీలించారు. మర్లగుమ్మి ఆనకట్టుకు గతేడాది అక్టోబరులో వర్షాలకు భారీ గండిపడి కొట్టుకుపోయిందని రామానాయుడు అన్నారు. దీంతో ఆనకట్టు పరిధిలో ఆరు వేల ఎకరాలకు సాగునీరు నిలిచిపోయి.. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మర్లగుమ్మి ఆనకట్టకు మరమ్మతులు ఎప్పుడు ? - Former MLA Ramanayudu inspecting the Marlagummi dam
సాగునీటి వ్యవస్థపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. వేల ఎకరాలకు సాగునీరు అందించే మర్లగుమ్మి ఆనకట్టకు పడిన గండికి ఎప్పుడు మరమ్మతులు చేస్తారని ప్రశ్నించారు.
![మర్లగుమ్మి ఆనకట్టకు మరమ్మతులు ఎప్పుడు ? Former MLA Gavireddy Ramanayudu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:22:27:1622170347-ap-vsp-111-28-ex-mla-anakattu-visiting-av-ap10152-28052021080523-2805f-1622169323-468.jpg)
మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు
ఆనకట్టకు గండి పడి నెలలు గడుస్తున్నా.. మరమ్మతులు చేపట్టలేదని, దీంతో 12 గ్రామాలకు చెందిన ఆరు వేల ఎకరాల రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నెలాఖరులోగా మరమ్మతులు చేపట్టకుంటే.. రాజకీయాలకు అతీతంగా ఆయకట్టు రైతులతో కలిసి శ్రమదానంతో బాగు చేసుకుంటామని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో, కోనాం జలాశయం ఛైర్మన్ గండి ముసలినాయుడు, రైతులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ..Corona: ఉమ్మడి కుటుంబంలో విషాదం..నెల రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి