రాష్ట్రంలో దేవాలయాలకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రక్షణ కరవైందని మాడుగుల నియోజకవర్గ తెదేపా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. విశాఖ జిల్లా కె.కోటపాడులో మాట్లాడుతూ.. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ విపరీతాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శివాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పూజలు నిర్వహించారు.
వైకాపా పాలనలో ఆలయాలకు రక్షణ కరవు: మాజీ ఎమ్మెల్యే - మాడగుల వార్తలు
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని... దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు.

శివాలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే గవిరెడ్డి