చిట్ ఫండ్ స్కామ్ కేసులో నిన్న విశాఖలో అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లోని ఓపీఐడి(Odisha Protection of Interests of Depositors) కోర్టులో హాజరుపరిచారు. వెల్ఫేర్ సంస్థ పేరుతో డిపాజిటర్లను 1200 కోట్ల రూపాయల మేర మోసం చేశారనే అభియోగాలపై..సోమవారం విశాఖలో విజయప్రసాద్‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం కేజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం.. విశాఖ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్‌పై ఒడిశాకు తరలించారు.
అసలేం జరిగింది..
ఒడిశాలోని సంబల్‌పూర్‌లోని ధనుపాలి పోలీస్ స్టేషన్‌లో.. మళ్ల విజయప్రసాద్‌పై కేసు నమోదైంది. వెల్ఫేర్ సంస్థ పేరుతో డిపాజిట్లు సేకరించి.. రూ.1200 కోట్ల కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాలో డిపాజిటర్లకు సక్రమంగా చెల్లింపులు జరపలేదని ఫిర్యాదులు అందాయి. ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, 406,467, 468, 471, 120 (బీ) కింద ఈవోడబ్ల్యూ(EOW) బృందం కేసు నమోదు చేసింది. ఈ కేసుపై సోమవారం విశాఖ వచ్చిన ఒడిశా సీఐడీ పోలీసులు స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మళ్ల విజయప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి:
CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్